నగర సమగ్ర అభివృద్ధిపై సమీక్ష
ABN , First Publish Date - 2020-09-16T06:18:16+05:30 IST
నగర సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపెల్లి వినోద్‌కుమార్, మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి

ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్‌తో మేయర్ గుండా ప్రకాశ్‌రావు భేటీ
వరంగల్‌సిటీ, సెప్టెంబరు 15 : నగర సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపెల్లి వినోద్‌కుమార్, మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి సమీక్షించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల అధికారిక నివాసంలో మేయర్ ప్రకాశ్‌రావు వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగరానికి చెందిన పలు అంశాలను మేయర్ ప్రకాశ్‌రావు ఆయనకు నివేదించారు. మాస్టర్ ప్లాన్‌ను సత్వరమే సీఎం కేసీఆర్ చేత ఆమోద ముద్ర వేయించాల్సిన ఆవశ్యకత ఈ సమీక్షలో ప్రధానంగా చర్చకు వచ్చింది. నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన క్రమంలో సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌పై పలు సూచనలు చేయనున్నట్లు వినోద్‌కుమార్ తెలిపారు.
బట్టల బజార్‌లో నిర్మించిన రైల్వే ఓవర్ బిడ్జి పరిహారం రూ.9.80 కోట్లు, దేశాయిపేటలో నిర్మించిన షాదీఖానా భవన పెండింగ్ బిల్లు రూ.1.80 కోట్లు జనరల్ ఫండ్స్ నుంచి చెల్లించేందుకు కార్పొరేషన్ సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి పరిపాలన పరమైన అనుమతి ఇప్పించాలని వినోద్‌కుమార్‌ను మేయర్ ప్రకాశ్‌రావు కోరారు. 452 మంది పారిశుధ్య సిబ్బంది నియమాకానికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని, ఖాళీగా ఉన్న మూడు డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయాలని మేయర్ ప్రకాశ్‌రావు కోరారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్.. మాస్టర్ ప్లాన్ సహా ఇతర అంశాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.