మురుగునీటి శుద్దికి కొత్త ఎస్టీపీల పై దృష్టిపెట్టాలి- కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-05-19T01:14:43+05:30 IST

వర్షాకాలం సమీపిస్తున్న నేపధ్యంలో జంటనగరాల్లో సమస్య వర్షపునీరు, మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన ప్రనాళికలురూపొందించాలని మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించారు.

మురుగునీటి శుద్దికి కొత్త ఎస్టీపీల పై దృష్టిపెట్టాలి- కేటీఆర్‌

హైదరాబాద్‌: వర్షాకాలం సమీపిస్తున్న నేపధ్యంలో జంటనగరాల్లో సమస్య వర్షపునీరు, మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన ప్రనాళికలురూపొందించాలని మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటి శుద్ధికి ఇప్పుడున్న ఎస్టీపీలతో అదే ప్రాంతాల్లో మరికొన్ని ఎస్టీపీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు. సోమవారం జలమండలిలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌పరిధిలో మురుగనీటి శుద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నూతన ఎస్టీపీల కోసం స్థలం అన్వేషించకుండా ఇప్పుడున్న ఎస్టీపీల ప్రాంగణంలోనే కొత్త వాటిని నిర్మించేందుకు సాధ్యాసాఽధ్యాలను పరిశీలించాలన్నారు.


కూకట్‌పల్లి నాలాపై వర్టికల్‌ ఎస్టీపీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఎస్టీపీల నిర్మాణంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం అంశాన్నిపరిశీలించాలన్నారు. గ్రేటర్‌పరిదిలో ప్రస్తుతం 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్‌డిల మురుగునీరు శుద్ధి జరుగుతోందని అధికారులు వివరించారు. నగరంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మురగునీటిని శుద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, జలమండలి ఎండి దాన కిషోర్‌ ఇతర ఉన్నతాధికారులుపాల్గొనారు  

Updated Date - 2020-05-19T01:14:43+05:30 IST