నూతన కోడ్‌కు ముందు మమ్మల్ని సంప్రదించాలి: టీఎస్‌ఆర్‌ఆర్‌ఈడబ్ల్యూఏ
ABN , First Publish Date - 2020-03-13T10:14:45+05:30 IST
నూతన కోడ్‌కు ముందు మమ్మల్ని సంప్రదించాలి: టీఎస్‌ఆర్‌ఆర్‌ఈడబ్ల్యూఏ

ఆబిడ్స్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ చట్టాలను మార్పు చేసి నూతన రెవెన్యూ కోడ్‌ను ప్రవేశపెట్టే ముందు తమతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ స్టేట్ రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మయ్య వెల్లడించారు. ధరణి వెబ్‌సైట్ భూ రికార్డుల పాసు పుస్తకాల వ్యవహారం కొలిక్కి రాలేదని, 15 శాతం ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూమికి సంబంధించిన అనేక విషయాలు కేంద్రం పరిధిలో ఉన్నందున విభజన విషయాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోరాదని సూచించారు. గ్రామ న్యాయాలయాల చట్టం-2008ను ప్రభుత్వం నేటి వరకూ అమలు చేయలేదని పేర్కొన్నారు. భూముల రీ-సర్వే చేస్తే భూ వివాదాలను సులువుగా పరిష్కరించవచ్చని, దీనికి 2014లో కేంద్రం అనుమతినిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎల్‌ఆర్‌యూసీ చేసిందన్నారు.