‘రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకివ్వలేదు’

ABN , First Publish Date - 2020-10-08T00:10:55+05:30 IST

కేసీఆర్ గతంలో ఎన్నికలను కలెక్షన్స్‌గా మార్చారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డితో...

‘రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకివ్వలేదు’

సిద్దిపేట: కేసీఆర్ గతంలో ఎన్నికలను కలెక్షన్స్‌గా మార్చారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ దుబ్బాక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఉద్యమంలో పోరాడిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రజలు ఈ ఉప ఎన్నికలో కర్రకాల్చి కేసీఆర్‌కు వాత పెట్టడం ఖాయమని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Read more