సోనియాగాంధీకి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ..
ABN , First Publish Date - 2020-08-24T17:22:11+05:30 IST
హైదరాబాద్: సోనియాగాంధీకి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మీపై, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
హైదరాబాద్: సోనియాగాంధీకి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మీపై, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. 23మంది సీనియర్లు లేఖ రాయడం దురదృష్టకరమన్నారు. మీ ప్రోత్సాహంతోనే తాము కాంగ్రెస్ పార్టీలో ఎదిగామన్నారు. క్లిష్ట సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. మోదీ విభజన రాజకీయాల వల్ల దేశం ప్రమాదంలో పడిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు మీ, రాహుల్ గాంధీల నాయకత్వమే సురక్షితమన్నారు. మరెవరూ కాంగ్రెస్‌కు న్యాయం చేయలేరని రేవంత్ పేర్కొన్నారు.