కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2020-10-01T22:24:05+05:30 IST
సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్- కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్- కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్పించాలని లేఖలో కోరారు. రాజకీయ దురుద్దేశంతో ఈ స్కీంను మీరు అటకెక్కించారని, ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన.. కొడంగల్ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని, కేఆర్ఎంబీ తన లేఖకు స్పందనగా ప్రత్యుత్తరం ఇచ్చిందని రేవంత్ తెలిపారు. ఏపీ కయ్యానికి కాలు దువ్వుతోందంటోన్న మీకు ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.