ఖైదీల ఆరోగ్య భద్రతపై కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
ABN , First Publish Date - 2020-03-23T23:26:57+05:30 IST
ఖైదీల ఆరోగ్య భద్రతపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి జైలులో 2వేల మంది ఖైదీలు ఉన్నారని, 200మంది జైలు ఉద్యోగులు ప్రతిరోజు నగరంలోకి వచ్చి వెళ్తుంటారని, జైలులో కనీసం సానీటైజర్ ఫెసిలిటీ

హైదరాబాద్: ఖైదీల ఆరోగ్య భద్రతపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి జైలులో 2వేల మంది ఖైదీలు ఉన్నారని, 200మంది జైలు ఉద్యోగులు ప్రతిరోజు నగరంలోకి వచ్చి వెళ్తుంటారని, జైలులో కనీసం సానీటైజర్ ఫెసిలిటీ కూడా లేదన్నారు. ఇప్పటికే పలు దేశాలు ఖైదీలకు బెయిల్ ఇచ్చి పంపే చర్యలు చేపట్టాయని తెలిపారు. ఖైదీలకు బెయిల్ ఇవ్వడంపై ఆలోచించాలని కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ కోరారు.