ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా?: రేవంత్ ట్వీట్

ABN , First Publish Date - 2020-10-21T19:57:33+05:30 IST

కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్‌ ప్రమాదంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల గురించి తనకంటే తెలిసినోడు ఎవడని

ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా?: రేవంత్ ట్వీట్

హైదరాబాద్: కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్‌ ప్రమాదంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల గురించి తనకంటే తెలిసినోడు ఎవడని ప్రశ్నించే కేసీఆర్‌కు కల్వకుర్తి లిఫ్ట్ స్కీంలో ఓ ఇంజనీర్‌కు ఉన్నంత జ్ఞానం కూడా లేదే అంటూ ఎద్దేవా చేశారు. ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా అంటూ ఘాటైన వ్యాక్యలు చేశారు. లిఫ్ట్ పంపుల్లో ప్రకంపనలపై హెచ్చరిస్తూ ఎస్ఈలు రాసిన లేఖలను తన ట్వీట్‌కు చేస్తూ... వాస్తవాలు ఇవిగో అని పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి లిప్ట్ దగ్గర ప్రమాదం చోటుచేసుకోవడంతో... మోటార్ నుంచి భారీ శబ్దం వచ్చి పంప్ హౌజ్‌‌లో పేలుడు సంభవించింది. దీంతో పంప్ హౌజ్‌లో 45 అడుగులకు పైన నీరు చేరింది. ఈ ప్రమాదంపై రాజకీయంగానూ పెను దుమారం చెలరేగుతోంది. అధికార పార్టీ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  

Updated Date - 2020-10-21T19:57:33+05:30 IST