రేవంత్‌ అనుచరులను అడ్డుకోండి: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-03-12T08:43:34+05:30 IST

జీవో 111 అంశాన్ని టీపీసీసీ చీఫ్‌ పదవికి లింకుపెట్టి ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరులు నానా రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కొన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్న నేతలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం

రేవంత్‌ అనుచరులను అడ్డుకోండి: జగ్గారెడ్డి

జీవో 111 అంశాన్ని టీపీసీసీ చీఫ్‌ పదవికి లింకుపెట్టి ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరులు నానా రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కొన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్న నేతలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై చర్చించేందుకు వెంటనే టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఖుంటియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను కోరారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ఒక వ్యవస్థ. దీనిపైన అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆధారపడి ఉన్నారు. రేవంత్‌ ఒక్కడే మగాడని, కాంగ్రె్‌సలో హీరోలే లేరంటూ వారు చేస్తున్న ప్రచారానికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది.’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-12T08:43:34+05:30 IST