దుబ్బాక దంగల్.. బీజేపీలో కేసీఆర్ గ్రూప్ ఉందా?

ABN , First Publish Date - 2020-10-28T01:57:20+05:30 IST

సిద్దిపేటలో సోమవారం హైటెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు ...

దుబ్బాక దంగల్.. బీజేపీలో కేసీఆర్ గ్రూప్ ఉందా?

సిద్దిపేటలో సోమవారం హైటెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. డబ్బులు గుర్తించామని పోలీసులు చెబుతుంటే.. పోలీసులే డబ్బులు పెట్టారని బీజేపీ నేతలు అంటున్నారు.  అయితే దుబ్బాకకు వెళ్తున్న బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో బండి సంజయ్‌కు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగిన ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఏమంటోంది...  ‘‘తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగిందా?. దుబ్బాక ఘటనపై కొందరు బీజేపీ సీనియర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు?. బీజేపీలో కేసీఆర్ గ్రూప్ కూడా ఉన్నదా?. ఎన్నికలు దుబ్బాకలో అయితే సిద్దిపేటలో దాడులేంటి?. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏం జరుగుతోంది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వీడియోను చూడగలరు.. 

Updated Date - 2020-10-28T01:57:20+05:30 IST