రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ పంచాయితీని పార్టీకి రుద్దొద్దు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-03-13T03:45:34+05:30 IST

మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ పంచాయితీని పార్టీకి రుద్దొద్దు: జగ్గారెడ్డి

హైదరాబాద్: మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నేను, దామోదర రాజనర్సింహ టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌ అనుచరులు పార్టీ పరువు తీస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ పంచాయతీని పార్టీకి రుద్దొద్దని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఒక్క రేవంత్‌రెడ్డినే పార్టీలో తీస్మార్‌ఖాన్‌ కాదని, ఎవరి శక్తి వారికి ఉంది, మాకు అభిమానులు లేరా?

 అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తాను విజిలేస్తే పదివేల మంది వస్తారని, బలవంతుడైతే రేవంత్ ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. టీడీపీని అధికారంలోకి తెచ్చి ఎందుకు సీఎం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలాన్ని ఉపయోగించుకోవడానికే రేవంత్‌రెడ్డి పార్టీలోకి వచ్చారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఫేస్‌బుక్ పోస్టులతో రేవంత్ కొంపముంచుతున్నారని, తనతో ఎందుకు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. తన బలమేంటో చూపించమంటారా?, ఇప్పటికైనా పిచ్చి పనులు ఆపండని జగ్గారెడ్డి అన్నారు.

Updated Date - 2020-03-13T03:45:34+05:30 IST