రేవంత్‌రెడ్డి పిల్ పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-12-10T17:46:55+05:30 IST

రేవంత్‌రెడ్డి పిల్ పై హైకోర్టులో విచారణ

రేవంత్‌రెడ్డి పిల్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసు దర్యాప్తు సీబీఐ, ఈడీ, ఎన్ సీబీకి అప్పగించాలన్న రేవంత్ రెడ్డి పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మూడేళ్ళుగా కౌంటర్ దాఖలు చేయడం లేదని రేవంత్ తరఫు న్యాయవాది రచన రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. డ్రగ్స్ కేసు తదుపరి విచారణ ఈ నెల 17కి కోర్డు వాయిదా వేసింది.


Updated Date - 2020-12-10T17:46:55+05:30 IST