ఆ ఆర్డినెన్స్‌తో అన్యాయం: రిటైర్డ్ అధికారులు
ABN , First Publish Date - 2020-06-18T09:56:40+05:30 IST
తాల కోత విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌తో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జీతాల కోత విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌తో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.మోహన్‌నారాయణ, ఎస్.నర్సరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెన్షనర్‌లకు రావాల్సిన నెల వారీ పెన్షన్‌లలో కోతతో కుటుంబ పోషణ, అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులు భరించలేకపోతున్నార న్నారు. కనీసం జూన్ నెల నుంచైనా ఉద్యోగులకు పూర్తి వేతనాన్ని, పెన్షనర్లకు పూర్తి పెన్షన్‌లు ఇవ్వాలని వారు కోరారు.