కరోనా విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-07-05T20:50:25+05:30 IST

కరోనా విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు.

కరోనా విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్: కరోనా విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. ప్రభుత్వం, వైద్య సిబ్బంది వేరు కాదని, ప్రభుత్వం విఫలం అంటే వైద్యులను అవమానించడమేనని చెప్పారు. నిరంతరం జనాల్లో ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలకు కరోనా వస్తోందని, కరోనా వస్తుందని తాము భయపడితే ప్రజలకు ధైర్యం చెప్పలేమని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

Updated Date - 2020-07-05T20:50:25+05:30 IST