విద్యార్థులను కాపాడుకోవడం మన బాధ్యత

ABN , First Publish Date - 2020-06-25T08:03:26+05:30 IST

ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులను కాపాడుకోవడం మన బాధ్యతని, చదువు కన్నా ప్రాణాలే ముఖ్యమని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసైఅన్నారు

విద్యార్థులను కాపాడుకోవడం మన బాధ్యత

చదువు కన్నా ప్రాణాలే ముఖ్యం: గవర్నర్‌ తమిళిసైహైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులను కాపాడుకోవడం మన బాధ్యతని, చదువు కన్నా ప్రాణాలే ముఖ్యమని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసైఅన్నారు. తమిళనాడులోని డీమ్డ్‌ వర్సిటీ గాంధీగ్రాం రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహిస్తున్న రెండు రోజుల వెబినార్‌  ప్రారంభ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నా, వాటిని తరగతి గదులతో పోల్చలేమన్నారు. సానుకూల దృక్పథం అనేది విద్యార్థుల్లో రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుందని, ఆ దిశగా పిల్లలను మలచడానికితల్లిదండ్రులు, విద్యాసంస్థలు కృషిచేయాలని పేర్కొన్నారు. తాను చేపట్టిన కనెక్ట్‌ ఛాన్సలర్‌, వీడియో కాన్ఫరెన్సు కార్యక్రమాలకు విద్యార్థుల నుంచి  వస్తున్న అనూహ్యమైన స్పందన తనకెంతో సంతృప్తినిస్తోందని గవర్నర్‌ తెలిపారు. 

Updated Date - 2020-06-25T08:03:26+05:30 IST