తెలంగాణ ప్రజల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి ఈటల

ABN , First Publish Date - 2020-03-28T19:34:01+05:30 IST

ఏదో జరుగుతోందని ప్రజలు అపోహపడొద్దని, తెలంగాణ ప్రజల బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎవరూ వ్యవహరించొద్దని

తెలంగాణ ప్రజల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి ఈటల

హైదరాబాద్: ఏదో జరుగుతోందని ప్రజలు అపోహపడొద్దని, తెలంగాణ ప్రజల బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎవరూ వ్యవహరించొద్దని, ప్రజలకు అవసరమైన సమాచారాన్నే చేరవేయాలని సూచించారు. పేపర్‌ పట్టుకుంటే కరోనా వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు వార్తలు ప్రమాదకరమని తెలుసుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గచ్చిబౌలిలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కరోనా నివారణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఈటల రాజేందర్ తెలిపారు.

Updated Date - 2020-03-28T19:34:01+05:30 IST