ఆడబిడ్డలకు ‘డబుల్ బెడ్ రూం’
ABN , First Publish Date - 2020-05-13T09:35:57+05:30 IST
ఆడబిడ్డలకు ఎంత కష్టం!’ శీర్షికన ఈనెల 3వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పం దించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి

- సమతకు ఉద్యోగ నియామక పత్రం.. రూ.15 లక్షల విరాళాలు
- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
హైదరాబాద్/చొప్పదండి, మే 12(ఆంధ్రజ్యోతి): ‘ఆడబిడ్డలకు ఎంత కష్టం!’ శీర్షికన ఈనెల 3వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పం దించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో తల్లిదండ్రుల మృతి తో అనాథలైన అక్కాచెల్లెళ్లకు డబుల్ బెడ్‌రూం ఇల్లును కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక మంగళవారం మంజూరు చేశారు. పెద్ద కుమార్తె నేరేళ్ల సమతకు ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి గంగుల కమాలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. ఆమెకు కరీంనగర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో అటెండర్ ఉద్యోగం ఇచ్చారు.
చిన్న కూతురు మమతకు రుక్నాపూర్ కస్తుర్బా గాంధీ పాఠశాలలో 7వ తరగతిలో చేర్పిస్తామని మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)కి కలెక్టర్ నివేదించారు. రూ.5 వేల ఆర్థిక సాయంతో పాటు 60 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందజేసినట్లు వివరించారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన దాతలు మంగళవారం నాటికి రూ.15 లక్షల విరాళాలు ఇచ్చారు.