ఐఐటీల్లో రిజర్వేషన్లను యథాతథంగా ఉంచాలి
ABN , First Publish Date - 2020-12-19T07:57:20+05:30 IST
దేశంలోని 23 ఐఐటీ విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో రిజర్వేషన్లను యథాతథంగా ఉంచాలని బీసీ సంక్షేమ

ప్రధాని మోదీకి ఆర్.కృష్ణయ్య లేఖ
హైదరాబాద్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): దేశంలోని 23 ఐఐటీ విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో రిజర్వేషన్లను యథాతథంగా ఉంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆ రిజర్వేషన్లను అమలు చేయొద్దని కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను తిరస్కరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారంప్రధానికి లేఖ రాశారు.