గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి చంద్రమౌళి మృతి

ABN , First Publish Date - 2020-12-11T05:02:27+05:30 IST

గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి చంద్రమౌళి మృతి

గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి చంద్రమౌళి మృతి
ఎడమ చంద్రమౌళి (పైల్‌)

మహబూబాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ఆంధ్రజ్యోతి విలేకరి ఎడమ చంద్రమౌళి (50) గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. తన ఇంటి వద్ద అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 20 ఏళ్లుగా ఆంధ్రజ్యోతిలో విలేకరిగా పని చేస్తూ ప్రజాసమస్యలను తన కలం ద్వారా వెలికితీసి పరిష్కారానికి కృషి చేసి మన్నలను పొందాడు. చంద్రమౌళి మృతి వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, ఎంపీపీ మూడ్‌ శివాజీచౌహన్‌, వైస్‌ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్‌, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫర్‌ నవాబ్‌, తెలంగాణ మాలమహానాడు (టీఎంఎం) రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు గార్లకు చేరుకుని చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా, చంద్రమౌళి అంత్యక్రియలు గార్లలో శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


Updated Date - 2020-12-11T05:02:27+05:30 IST