నేడు ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీ పోలింగ్‌

ABN , First Publish Date - 2020-12-03T07:45:27+05:30 IST

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో గురువారం రీ పోలింగ్‌ జరగనుంది. ఈమేరకు అవసరమైన

నేడు ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీ పోలింగ్‌

54,655 మంది ఓటర్లు.. 

69 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు 

చాదర్‌ఘాట్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో గురువారం రీ పోలింగ్‌ జరగనుంది. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా తహసీల్దార్‌ శైలజను ప్రత్యేకంగా నియమించారు. ఎన్నికల రంగంలోకి బరిలో ఉన్న ఆరుగురు అభ్యర్థుల్లో సీపీఐ అభ్యర్ధి ఫిర్దోస్‌ ఫాతిమాకు కేటాయించిన ఎన్నికల గుర్తు తారుమారు కావడంతో ఆపార్టీకి చెందిన ఎన్నికల ఏజెంట్‌ సయ్యద్‌ మన్నాన్‌.. ఆపార్టీ నాయకుల ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌లో మంగళవారం జరిగిన పోలింగ్‌ను రద్దు చేసింది. గురువారం రీపోలింగ్‌ జరపాలని నిర్ణయించింది.


రీపోలింగ్‌ సందర్భంగా డివిజన్‌లోని 69 పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన సామగ్రితో పోలింగ్‌ సిబ్బందిని రలించారు. బుధవారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది, డివిజన్‌లోని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రర 6గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. డివిజన్‌ పరిధిలో 54,655 మంది ఓటర్లున్నారు. పోలింగ్‌ సామగ్రి, అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు వీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌ పర్యవేక్షించారు.

పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6 డీసీ రజినీకాంత్‌రెడ్డి ఎన్నికల పరిశీలకుడికి వివరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. 


Updated Date - 2020-12-03T07:45:27+05:30 IST