చివరివిడత కౌన్సెలింగ్‌లో ఫార్మసీ సీట్లన్నీ భర్తీ
ABN , First Publish Date - 2020-12-06T07:51:42+05:30 IST
ఎంసెట్ చివరివిడత కౌన్సెలింగ్‌లో బైపీసీ విద్యార్థులకు సంబంధించిన బీఫార్మసీ, ఫామ్-

ఎంసెట్ చివరివిడత కౌన్సెలింగ్‌లో బైపీసీ విద్యార్థులకు సంబంధించిన బీఫార్మసీ, ఫామ్-డి, బయో టెక్నాలజీ కోర్సుల సీట్లన్నీ భర్తీ అయ్యాయి.
బీఫార్మసిలో 119 విద్యాసంస్థల్లో 6,835 సీట్లు, 56 ఫామ్-డి కాలేజీల్లోని 1,126 సీట్లు, ఒక బయోటెక్నాలజీ కాలేజీలోని 21 సీట్లు చొప్పున మొత్తం 7,982 సీట్లు భర్తీ అయ్యాయని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. సీట్లు ఖరారైన విద్యార్థులు ఈనెల 9లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలని సాంకేతి విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.