2.50 లక్షల కొలువులు భర్తీ చేయండి: కృష్ణయ్య

ABN , First Publish Date - 2020-12-15T08:36:32+05:30 IST

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్‌లు జారీ చేయకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల

2.50 లక్షల కొలువులు భర్తీ చేయండి: కృష్ణయ్య

బర్కత్‌పుర, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్‌లు జారీ చేయకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య హెచ్చరించారు. యాభైవేల ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, చెప్పినట్టుగానే భర్తీ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.


సోమవారం కాచిగూడ మహేంద్రగార్డెన్‌లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గ్రూప్‌1లో 1,600 పోస్టులు, గ్రూప్‌ 2లో 4వేలు, గ్రూప్‌ 3లో 8వేలు గ్రూప్‌ 4లో నలబై వేల ఉద్యోగాలు, 70 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


Read more