మృతదేహాన్ని ఇక్కడికి తేవొద్దు

ABN , First Publish Date - 2020-07-14T08:33:17+05:30 IST

ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆయన మృతదేహాన్ని

మృతదేహాన్ని ఇక్కడికి తేవొద్దు

  • అద్దె ఇంటి యజమాని హెచ్చరిక
  • గల్ఫ్‌లోనే తెలంగాణ వాసి అంత్యక్రియలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆయన మృతదేహాన్ని తన ఇంటికి తేవొద్దంటూ ఇంటి యజమాని హెచ్చరించాడు. మరోవైపు.. మృతుడి కుటుంబం పేదరికంతో ఇబ్బందులు పడుతోంది. దీంతో కార్మికుడి మృతదేహాన్ని ఎడారి దేశంలోనే దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశారెడ్డిపల్లెకు చెందిన కర్రె రాజారెడ్డి ఊపిరితిత్తుల వ్యాధితో బహ్రెయిన్‌లో మరణించారు. ఆయన మృతదేహాన్ని మాతృ భూమికి పంపించాలని ప్రయత్నించారు. అయితే, వేములవాడలో ఆయన కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని.. తన ఇంట్లోకి మృతదేహం రావడానికి వీల్లేదని హెచ్చరించాడు. చేసేదేమీలేక రాజారెడ్డి మృతదేహాన్ని పంపించవద్దంటూ ఆయన కుటుంబం కోరగా.. ఇటీవల బహ్రెయిన్‌లో దహన సంస్కారాలు జరిపారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి రవాణా ఖర్చు, కరోనా భయం కా రణంగా, మృతుడి కుటుంబం కూడా వెనుకంజ వేసింది

Updated Date - 2020-07-14T08:33:17+05:30 IST