రఘునందన్‌రావుకు ఊరట

ABN , First Publish Date - 2020-10-07T08:15:12+05:30 IST

భూ వివాదం కేసులో బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది.

రఘునందన్‌రావుకు ఊరట

భూ వివాదం కేసులో చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు


భూ వివాదం కేసులో బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. అరెస్టు సహా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తన భూ వివాదాన్ని పరిష్కరిస్తామంటూ కొందరు వ్యక్తులు బ్లాక్‌ చేస్తున్నారని, రఘునందన్‌రావు సహకారంతోనే ఇలా జరుగుతోం దంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయ్‌పోల్‌ గ్రామానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రఘునందన్‌పై కేసు నమోదైంది.


అయితే, రాజకీయ ప్రత్యర్థులు ఉసిగొల్పడంతో నిరాధార అభియోగాలతో తనపై కేసు పెట్టారని, దానిని రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. దీనిని హైకోర్టు   కౌంటర్‌ దాఖలుకు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Read more