రైతు రుణమాఫీ మార్గదర్శకాల విడుదల

ABN , First Publish Date - 2020-03-18T11:28:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేయనున్న పంట రుణాల మాఫీకి సంబంధించి న మార్గదర్శకాలను

రైతు రుణమాఫీ మార్గదర్శకాల విడుదల

భూపాలపల్లిరూరల్‌, మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేయనున్న పంట రుణాల మాఫీకి సంబంధించి న మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాలో పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను బ్యాంకులు తయారుచేస్తున్నాయి. ఈ మేరకు 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబ రు వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. రూ. 25 వేల వరకు రుణం తీసుకున్న రైతులకు ఒకేదఫాలో మాఫీ చె క్కులను అందించనున్నారు. రూ. 1లక్ష లోపు ఉన్న రైతులకు 4 విడతల్లో రుణ మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక కుటుంబానికి రూ.1 లక్ష వరకు రుణ మాఫీ ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రుణమాఫీ ఉత్తర్వులు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-03-18T11:28:03+05:30 IST