ఔషధ కొనుగోళ్ల నిబంధనల సడలింపు

ABN , First Publish Date - 2020-04-05T11:26:01+05:30 IST

కరోనా కట్టడికి సత్వర చికిత్సలు అందించాల్సిన నేపథ్యంలో.. ఔషధాలు, వైద్య, డయాగ్నోస్టిక్‌, సర్జికల్‌ పరికరాల కొనుగోళ్లకు ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈ మేరకు ఉత్తర్వులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌...

ఔషధ కొనుగోళ్ల నిబంధనల సడలింపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి సత్వర చికిత్సలు అందించాల్సిన నేపథ్యంలో.. ఔషధాలు, వైద్య, డయాగ్నోస్టిక్‌, సర్జికల్‌ పరికరాల కొనుగోళ్లకు ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈ మేరకు ఉత్తర్వులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లకు ఓపెన్‌ టెండర్లను ఆహ్వానించడం, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల లోపు కొనుగోళ్లకు లిమిటెడ్‌ టెండర్లను ఆహ్వానించడం వంటి నిబంధనల జోలికి వెళ్లకుండా.. ఇదివరకే రేట్‌ కాంట్రాక్టు కింద ఎంప్యానెల్‌ అయిన కాంట్రాక్టర్లు లేదా ప్రభుత్వ ఈ-మార్కెటింగ్‌ సంస్థల నుంచి త్వరితగతిన ఔషధాలు, పరికరాలను కొనుగోలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 

Updated Date - 2020-04-05T11:26:01+05:30 IST