ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా రిజిస్ర్టేషన్లు చేయాలి

ABN , First Publish Date - 2020-09-24T09:20:05+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా రిజిస్ర్టేషన్లు చేయాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా రిజిస్ర్టేషన్లు చేయాలి

తెలంగాణ రియల్టర్ల సంఘం ఆందోళన


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లనూ రిజిస్ట్రేషన్‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర రియల్టర్ల సంఘం డిమాండ్‌ చేసింది. మొజంజాహి మార్కెట్లోని స్టాంప్స్‌ అండ్స్‌ రిజిస్ర్టార్‌ ఐజీ కార్యాలయానికి సంఘం నాయకులు, సభ్యులు ర్యాలీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు. అనంతరం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్స్‌ ఐజీ టి.చిరంజీవులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఆందోళనలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T09:20:05+05:30 IST