ఆన్‌లైన్‌లోనే బీఎస్‌-4 వాహనాల రిజిస్ర్టేషన్‌

ABN , First Publish Date - 2020-03-27T11:04:33+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను దేశమంతా అమలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో

ఆన్‌లైన్‌లోనే బీఎస్‌-4 వాహనాల రిజిస్ర్టేషన్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను దేశమంతా అమలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. రవాణా శాఖలో బీఎస్‌-4 రిజిస్ర్టేషన్‌కు సంబంధించిన గడువు మార్చి 31 వరకే ఉంది. దీనికి రవాణా శాఖ అధికారులు ఆన్‌లైన్‌లోనే వాహనాల రిజిస్ర్టేషన్‌ను పూర్తి చేసుకునేలా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. 24 గంటల పాటు ఈ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. కొత్త బీఎస్‌-4 వాహనాలకు సైతం ఈనెల 31 లోగా ఆన్‌లైన్‌లోనే శాశ్వత రిజిస్ర్టేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు.


ఇంతకుముందు స్లాట్‌ బుక్‌ చేసుకొని తమ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే శాశ్వత రిజిస్ర్టేషన్‌కు సంబంధించిన ఫీజు చెల్లిస్తే, రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి, నంబర్‌ కేటాయింపుతో పాటు ఒక సందేశాన్ని పంపేలా అధికారులు వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు.  తర్వాత వాహనాన్ని తీసుకెళ్లి చూపిస్తే ఆర్‌సీని ఇస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-03-27T11:04:33+05:30 IST