కోహీర్‌ గజగజ

ABN , First Publish Date - 2020-12-07T08:08:11+05:30 IST

తెలంగాణను చలి వణికిస్తోంది. 16 జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు అటు ఇటుగా ఉంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.02 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది

కోహీర్‌ గజగజ

7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

గిన్నెధరిలో 7.9 డిగ్రీలు

16 జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు


హైదరాబాద్‌/కోహీర్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణను చలి వణికిస్తోంది.  16 జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు అటు ఇటుగా ఉంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.02 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రం భీం జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్‌ంఎసీ పరిధిలోని పఠాన్‌చెరు, రామచంద్రపురంలో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. రాబోయే రెండు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

Updated Date - 2020-12-07T08:08:11+05:30 IST