తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సమస్యలపై నిరసనలు

ABN , First Publish Date - 2020-12-15T23:48:43+05:30 IST

రాష్ట్రంలో పలుచోట్ల రిజిస్ట్రేషన్ల సమస్యలపై నిరసనలు హోరెత్తాయి. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్స్ అండ్ రైటర్స్ ఫెడరేషన్

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సమస్యలపై నిరసనలు

హైదరాబాద్: రాష్ట్రంలో పలుచోట్ల రిజిస్ట్రేషన్ల సమస్యలపై నిరసనలు హోరెత్తాయి. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్స్ అండ్ రైటర్స్ ఫెడరేషన్ ఆందోళన చేపట్టింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నెమ్మదిగా సాగింది. ఈరోజు కేవలం 6 స్లాట్స్ మాత్రమే బుకింగ్ అయ్యాయి. సర్వర్లు మొరాయించడంతో స్లాట్ బుకింగ్ సమస్య తలెత్తింది. 


సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు ధర్నాకు దిగారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం వల్ల ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణికి వ్యతిరేకంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ధర్నా, ర్యాలీ చేపట్టారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని జగిత్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా చేపట్టారు.

Updated Date - 2020-12-15T23:48:43+05:30 IST