కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : రావుల

ABN , First Publish Date - 2020-07-19T08:46:33+05:30 IST

కరోనా బారిన పడి వైద్యం అందక చనిపోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విజ్ణప్తి చేశారు...

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : రావుల

హైదరాబాద్‌, జులై 18 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి వైద్యం అందక చనిపోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విజ్ణప్తి చేశారు. మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రధాన ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూచించారు. వైద్యులు, సిబ్బందికి, పోలీసులకు, మీడియా, పారిశుధ్య సిబ్బందికి తక్షణం పీపీఈ కిట్లు అందించాలని, రోగులకు వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. 

Updated Date - 2020-07-19T08:46:33+05:30 IST