పేదల ఇళ్లకే నిత్యావసరాలు పంపాలి: నారాయణ
ABN , First Publish Date - 2020-04-05T08:28:54+05:30 IST
పేదల ఇళ్ల వద్దకు నిత్యావసర సరుకులను పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. సీపీఐ గ్రేటర్ కార్యదర్శి ఈటీ నర్సింహ ఆధ్వర్యంలో...

- సింగరేణి కార్మికులకు పూర్తి వేతనాలివ్వాలి: చాడ
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల వద్దకు నిత్యావసర సరుకులను పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. సీపీఐ గ్రేటర్ కార్యదర్శి ఈటీ నర్సింహ ఆధ్వర్యంలో శనివారం ఫిలింనగర్ వినాయక్‌నగర్ ప్రాంతాల్లోని వలస కార్మికుల కుటుంబాలకు ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి నారాయణ బియ్యం, తదితర నిత్యావసరాలను పంపిణీ చేశారు. సింగరేణి కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.