రంగనాయకసాగర్‌ను చుట్టేసేలా
ABN , First Publish Date - 2020-06-16T09:40:38+05:30 IST
రంగనాయకసాగర్‌ను చుట్టేసేలా

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో బోటు సందడి చేసింది. రిజర్వాయర్‌ను నిర్మించిన కాంట్రాక్టు ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు సోమవారం బోటులో చక్కర్లు కొట్టారు. తొలిసారిగా ఇక్కడ బోటు కనపడడంతో స్థానికులు ఆసక్తికరంగా చూశారు. రాబోయే రోజుల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ‘బోటులో షికారు’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని గతంలో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
సిద్దిపేట జిల్లా ఫొటోగ్రాఫర్