నల్లగొండలో ర్యాండమ్‌ టెస్టులు రేపటికి వాయిదా

ABN , First Publish Date - 2020-04-25T08:40:29+05:30 IST

ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల రాకలో జాప్యం వల్ల నల్లగొండలో శుక్రవారం నిర్వహించాల్సిన కరోనా పరీక్షలు ఆదివారానికి వాయిదా పడ్డాయి.

నల్లగొండలో ర్యాండమ్‌ టెస్టులు రేపటికి వాయిదా

నల్లగొండ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల రాకలో జాప్యం వల్ల నల్లగొండలో శుక్రవారం నిర్వహించాల్సిన కరోనా పరీక్షలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా ర్యాండమ్‌ టెస్టులను నిర్వహించడానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) 82 జిల్లాలను ఎంపిక చేసింది. అందులో నల్లగొండ కూడా ఉంది. పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు శుక్రవారమే నల్లగొండకు వచ్చారు. కలెక్టర్‌, వైద్య శాఖ సిబ్బందితో కరోనా పరీక్షల నిర్వహణపై చర్చించారు. టెస్టులు ఎలా నిర్వహించాలన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే టెస్టింగ్‌ కిట్ల రాకలో జాప్యం వల్ల  పరీక్షలను వాయిదా వేశారు.

Updated Date - 2020-04-25T08:40:29+05:30 IST