రామోజీ విరాళం 20 కోట్లు
ABN , First Publish Date - 2020-04-01T08:52:47+05:30 IST
కరోనా మహమ్మారిపై పోరు కోసం రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు తరఫున తెలుగు రాష్ట్రాలకు రూ.10 కోట్ల చొప్పున... మొత్తం రూ.20 కోట్ల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఆర్టీజీఎస్ ద్వారా

తెలుగు రాష్ట్రాలకు చెరో 10 కోట్లు అందజేత
హైదరాబాద్, మార్చి 31: కరోనా మహమ్మారిపై పోరు కోసం రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు తరఫున తెలుగు రాష్ట్రాలకు రూ.10 కోట్ల చొప్పున... మొత్తం రూ.20 కోట్ల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఆర్టీజీఎస్ ద్వారా రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధి ఖాతాలకు బదిలీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు రామోజీరావు వేర్వేరుగా లేఖలు రాశారు. కరోనాపై పోరులో ఇరు రాష్ట్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సంఘీభావంగా ప్రకటిస్తూ తమవంతుగా విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.