సౌదీలో రామాయంపేట వాసి మృతి

ABN , First Publish Date - 2020-04-24T09:53:51+05:30 IST

బతుకుదెరువు కోసం దేశం కాని దేశానికి వలస వెళ్లాడు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ప్రాణాలు వదిలాడు.

సౌదీలో రామాయంపేట వాసి మృతి

రామాయంపేట, ఏప్రిల్‌ 23 : బతుకుదెరువు కోసం దేశం కాని దేశానికి వలస వెళ్లాడు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ప్రాణాలు వదిలాడు. తనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా తనకేమైనా వైరస్‌ సోకిందేమోనన్న భయంతో గుండెపోటుతో ఆ వ్యక్తి చనిపోయాడు. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన షేక్‌ ఉబేదుల్లా (48) 4 నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. సౌదీ ప్రభుత్వం ఈనెల 21న అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో షేక్‌కు పరీక్షలు చేస్తుండగా గుండెపోటుతో చనిపోయాడు. మృతుడికి భార్య ముంతాజ్‌, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

Updated Date - 2020-04-24T09:53:51+05:30 IST