31న రామప్ప భూముల కౌలు వేలం
ABN , First Publish Date - 2020-12-30T05:25:52+05:30 IST
31న రామప్ప భూముల కౌలు వేలం
వెంకటాపూర్(రామప్ప), డిసెంబరు 29 : మండలంలోని పాలంపేటలో రామప్ప దేవాలయ భూములను రబీలో సాగు చేసేందుకు ఈనెల 31న కౌలు వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు ధరావత్ సొమ్ము రూ.45 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. ఉదయం 11 గం టలకు తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.