ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ను ప్రకటించాలి: రామచంద్రరావు

ABN , First Publish Date - 2020-12-30T18:50:07+05:30 IST

హైదరాబాద్: ఏపీలో మాదిరి ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ను ప్రకటించాలి: రామచంద్రరావు

హైదరాబాద్: ఏపీలో మాదిరి ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చే లోపే.. సీఎం కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. పీఆర్సీ ఆసలస్యమైతే.. వెంటనే ఐఆర్ ఇవ్వాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కేంద్రం మూడు డీఏలు ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చిందన్నారు. ఖాళీగా ఉన్న 3లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలకు వీసీలు, ప్రొఫెసర్లను నియంచాలన్నారు. భార్యాభర్తలు ఒకే చోట ఉద్యోగం చేసేలా బదిలీలు చేస్తామని ముఖ్యమంత్రి మాట తప్పారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-30T18:50:07+05:30 IST