రాజరాజేశ్వర జలాశయంలోకి భారీగా వరద
ABN , First Publish Date - 2020-08-22T14:58:45+05:30 IST
జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు)లో భారీగా వరద వచ్చి చేరుతోంది.
రాజన్నసిరిసిల్ల: జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు)లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 315.33 మీటర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 25.873 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 21.16 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే ఇన్ ఫ్లో 6,112 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 8659 క్యూసెక్కులుగా ఉంది.