కరోనాపై పోరాటం.. దాతృత్వం చాటుకున్న కోవిద ఫౌండేషన్

ABN , First Publish Date - 2020-04-05T16:18:31+05:30 IST

కోవిడ్ - 19(కరోనా వైరస్) వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో కోవిద సహృదయ ఫౌండేషన్ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది.

కరోనాపై పోరాటం.. దాతృత్వం చాటుకున్న కోవిద ఫౌండేషన్

హైదరాబాద్: కోవిడ్ - 19(కరోనా వైరస్) వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో కోవిద సహృదయ ఫౌండేషన్ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది. కరోనాపై పోరాటంలో ముందుంటున్న వైద్య, మున్సిపల్, పోలీస్ సిబ్బందికి అవసరమైన శానిటైజర్లు, మాస్కులను శనివారం పంపిణీ చేసింది. నీలోఫర్ హాస్పిటల్ వారికి పీపీ కిడ్స్ 500 సోప్స్, ఎన్95 మాస్కులతో పాటు 250 లీటర్ల శానిటైజర్ బాటిల్స్‌ని అందించింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా వీటిని నీలోఫర్ అధికారులకు అందజేసింది. దీంతో పాటు రాజ్‌భవన్‌లో ఉండే పోలీసుల, ఇతర సిబ్బందికి భోజన వసతి కల్పించింది.


అనంతరం సంస్థ చైర్మన్ డాక్టర్ అనూహ్య రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని విజ్ఞప్తి మేరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించాలని ప్రజలను కోరారు. కరోనా వ్యాధి నుంచి దేశం బయటపడాలని అభిలషించారు. 

 

Updated Date - 2020-04-05T16:18:31+05:30 IST