నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-03-25T12:33:32+05:30 IST

నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. ఉత్తర కర్ణాటక, దక్షిణ మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం, దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు దక్షిణ కర్ణాటక మీదుగా 1.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

Updated Date - 2020-03-25T12:33:32+05:30 IST