రాగల మూడురోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2020-06-21T20:12:01+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని..

రాగల మూడురోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఒడిశా పరిసర ప్రాంతాలలో 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ  నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంటుందని, దాని ప్రభావంతో  అక్కడక్కడ ఉరుములు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయన్నారు.


ఇవాళ చాలా చోట్ల, సోమవారం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ కోమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,  వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-21T20:12:01+05:30 IST