వనపర్తిజిల్లా: పానగల్‌లో వర్షాలు
ABN , First Publish Date - 2020-07-27T22:28:37+05:30 IST
పానగల్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వనపర్తి జిల్లా: పానగల్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు పొంగుతున్నాయి. పానగల్‌లోని పొల్కీ చెరువు నిండి అలుగు పారుతోంది. 11 ఏళ్ల తర్వాత చెరువు నిండడంతో రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొల్కీ చెరువు కింద దాదాపు 3వేల ఆయుకట్టు ఉంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుకు మరమ్మత్తులు చేపట్టాక ఇప్పుడు భారీగా నీరు చేరింది. ఈసారి పంటలు పండించేందుకు నీటి కొరత ఉండదని రైతులు ఆనందంగా ఉన్నారు.