3 రోజుల పాటు మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-06-25T08:38:34+05:30 IST

3 రోజుల పాటు మోస్తరు వర్షాలు

3 రోజుల పాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ నుంచి 3.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 2.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-06-25T08:38:34+05:30 IST