రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , First Publish Date - 2020-08-22T12:54:12+05:30 IST

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అల్పపీడనం ఏర్పడిన తర్వాత, గమనానికి అనుగుణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. 

Updated Date - 2020-08-22T12:54:12+05:30 IST