4 రోజులపాటు వర్షాలు
ABN , First Publish Date - 2020-05-13T11:49:23+05:30 IST
4 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 4 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకా శం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం లో అండమాన్ వద్ద అల్పపీడనం ఏర్పడే అవకా శం ఉందన్నారు. మెదక్‌లో మంగళవారం గరిష్ఠ ఉష్టోగ్రత 42.5 డిగ్రీలు నమోదైంది. ఖమ్మంలో 41.2, హైదరాబాద్‌లో 37.6 డిగ్రీలు నమోదైంది.