2 రోజులు తేలికపాటి వర్షాలు
ABN , First Publish Date - 2020-07-10T08:26:11+05:30 IST
2 రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్, జులై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాల్లోనూ ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు దక్షిణ ఒడిసా, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎ త్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపారు.