పండ్లు, కూరగాయల ఎగుమతులకు రైల్వే వ్యాగన్లు
ABN , First Publish Date - 2020-04-12T09:03:17+05:30 IST
పండ్లు, కూరగాయలు, ఇతర పంట ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రైల్వే పార్శిల్ వ్యాగన్లను ఉపయోగించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి అభిలక్ష్ లిక్కి

- లోడింగ్, అన్‌లోడింగ్ సరఫరాదారు బాధ్యతే: అభిలక్ష్ లిక్కి
హైదరాబాద్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): పండ్లు, కూరగాయలు, ఇతర పంట ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రైల్వే పార్శిల్ వ్యాగన్లను ఉపయోగించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి అభిలక్ష్ లిక్కి కోరారు. నిల్వచేయటానికి వీలులేని ఉత్పత్తులను రైల్వే ద్వారా రాష్ట్రాలకు రవాణా చేయటానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నట్లు తెలిపారు. రైల్వే బోర్డు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శైలేంద్రశర్మ, అన్ని రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులు, మిషన్ డైరెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఉత్పత్తి చేసే బత్తాయి, మామిడి, కూరగాయలు, పూల రవాణాపైనా వీసీలో చర్చించారు. ఒక సరఫరాదారు కనీసం 23 టన్నుల రవాణా పార్శిల్ వ్యాగన్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. లోడింగ్, అన్‌లోడింగ్ బాధ్యతలు సరఫరాదారులే చూసుకోవాలని సూచించారు.