రైల్వేలో 2500 ఐసోలేటెడ్ కోచ్‌లు సిద్ధం
ABN , First Publish Date - 2020-04-07T09:14:24+05:30 IST
భారతీయ రైల్వే పరిధిలోని 17 జోన్లలో 5000 ఐసోలేటెడ్ కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 2,500 ఐసోలేటెడ్ కోచ్‌లు అన్ని సౌకర్యాలతో ఏర్పాటయ్యాయని వివరించింది. వీటి ద్వారా

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): భారతీయ రైల్వే పరిధిలోని 17 జోన్లలో 5000 ఐసోలేటెడ్ కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 2,500 ఐసోలేటెడ్ కోచ్‌లు అన్ని సౌకర్యాలతో ఏర్పాటయ్యాయని వివరించింది. వీటి ద్వారా 40వేల పడకలు అందుబాటులోకి వచ్చాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. రోజుకు 375 కోచ్‌లను ఐసోలేటెడ్ సౌకర్యాలుగా మారుస్తున్నామని, దేశంలోని 133 చోట్ల ఈ కోచ్‌లను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. కాగా.. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని సికింద్రాబాద్(లాలాగూడ), కాచిగూడ, విజయవాడ, కాకినాడలలో 50 ఐసోలేటెడ్ కోచ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.