ఫోన్‌ కాల్స్‌ స్పందనలో రాచకొండ పోలీస్‌ టాప్‌

ABN , First Publish Date - 2020-09-17T12:54:30+05:30 IST

ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. బాధిత ప్రజల నుంచి

ఫోన్‌ కాల్స్‌ స్పందనలో రాచకొండ పోలీస్‌ టాప్‌

హైదరాబాద్‌ : ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. బాధిత ప్రజల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు తక్షణమే స్పందించడంలో రాచకొండ పోలీసులు తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిచారని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు ది ఆఫీసర్స్‌ ఆఫ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సటెన్స్‌ నిర్వహించిన రాండమ్‌ సర్వేలో 68.57 శాతంతో రాచకొండ పోలీసులు టాప్‌లో నిలిచారు. నిర్వాహకులు అన్ని స్థాయిల్లోని పోలీస్‌ అధికారుల అధికారిక నంబర్‌లకు ఫోన్‌ చేసి, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పరిగణనలోకి తీసుకొని సర్వే నిర్వహించారు. ఫోన్‌ చేసిన వ్యక్తి గురించి ఆరా తీయకుండా, యక్ష ప్రశ్నలు వేయకుండా.. ఫోన్‌ రాగానే తక్షణమే స్పందించడంలో రాచకొండ పోలీసులు ప్రథమ స్థానంలో నిలిచారు. బుధవారం సిబ్బందితో వెబినార్‌ నిర్వహించిన సీపీ 100 శాతం సక్సెస్‌ను సాధించాలని కోరారు.

Updated Date - 2020-09-17T12:54:30+05:30 IST